మేడ్చల్ మల్కాజ్ గిరి: చైనా మంజా మెడకు తగిలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర్ పరిధిలో జరిగింది. యువకుడి మెడకు వైద్యులు 19 కుట్లు వేశారు. మల్లికార్జుననగర్ కాలనీలో తన బైకుపై వ్యవసాయ పనులకోసం వెళ్తుండగా మెడకు చైనా మంజా చుట్టుకుని జశ్వంత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. 19 కుట్లు వేసి ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చైనా మంజాలు విక్రయించిన వారిని కట్టడి చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగ చాటుగా విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.