మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోకి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. గోవా, ఢిల్లీ, హ ర్యానా తదితర ప్రాంతాల నుంచి నాన్ డ్యూటీ పె యిడ్ లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకకోవడంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి అనేక కారణాలు ఉన్నాయని తప్పు మాది కాదనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పేర్కొంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం, చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టే అవకాశం లేకపోవడం, తదితర కారణాలతోనే ఇతర రాష్ట్రాల మద్యాన్ని యథేచ్ఛ గా తెలంగాణలో తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఎక్సైజ్ జీఓ 72లో ఉన్న లోపాల వల్ల కూడా అక్రమ మద్యం రాష్ట్రంలోకి ఏ రులై పారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2024లో 11వేల లీటర్ల మద్యం
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో ప్రతిసారి వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు పట్టుబడుతు న్నా పూర్తిస్థాయిలో దానిని అరికట్టలేకపోతున్నా రు. రెండేళ్లుగా అక్రమంగా వస్తున్న వేల లీటర్ల వి దేశీ మద్యం, ఇతర రాష్ట్రాల మద్యంతో రాష్ట్ర ఎక్సై జ్ ఆదాయానికి గండిపడుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఇ తర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే మద్యం తో సంవత్సరానికి రూ.500 కోట్ల పైచిలుకు ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ కోల్పోతున్నట్టుగా గణాంకా లు పేర్కొంటున్నాయి. నాన్ డ్యూటీ పెయిట్ లిక్క ర్ (ఎన్‌డిపిఎల్)కు సంబంధించి 2023 సంవత్సరంలో 30వేల లీటర్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అ ధికారులు పట్టుకోగా 2024 సంవత్సరంలో 11 వేల లీటర్ల మద్యాన్ని మాత్రమే ఎక్సైజ్ శాఖ పట్టుకోగలిగింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ జిఓఎంఎస్ 72 ప్రకారం ప్రతి వ్యక్తి 6 బాటిళ్లు కలిగి ఉండవ చ్చు. కానీ, ఇవి తెలంగాణ టిజిబిసిఎల్ మద్యం బాటిళ్లుగా ఉండాలని జీఓలో లేదు. దీనిని అసరాగా చేసుకొని చాలా మంది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారని మద్యం వ్యాపారులు పేర్కొంటున్నారు.
గోవాలో అతి తక్కువ ఎక్సైజ్ సుంకాలు
పర్యాటకులను ఆకర్షించేందుకు గోవా అతి తక్కువ ఎక్సైజ్ సుంకాలను విధిస్తోంది. దీనివల్ల అక్కడ మద్యం ధర తెలంగాణ కంటే చాలా తక్కువ. ఈ ధరల తేడా వల్ల స్మగ్లింగ్ (అక్రమ రవాణా) ప్రోత్సహిస్త్తోంది. దీనివల్ల అక్రమ రవాణాదారులు గోవా మద్యం ఇక్కడ అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వ్యక్తిగత వినియోగం కోసమైనా గోవా మద్యం తెలంగాణ తీసుకురావడం చట్టవిరుద్ధం. దీంతోపాటు (విదేశాల నుంచి వచ్చే వారు డ్యూటీ- ఫ్రీ కింద 2 లీటర్ల విదేశీ మద్యం తీసుకురావడానికి అనుమతి ఉంటుంది). ఇలాంటి నిబంధనలతో వివిధ రకాలుగా రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ చెలామణీ అవుతోంది.
గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి..
గోవా ఎయిర్ పోర్టులో ఒక మద్యం షాపు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వచ్చే వారికి తక్కువ ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లు అందిస్తున్నారు. హైదరాబాద్‌కు గోవా నుంచి రోజుకు రెండు రైళ్లు వస్తాయి. ఈ రైళ్లలో గోవా నుంచి ప్రతి ఒక్కరూ రెండు నుంచి ఐదు బాటిళ్లను తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి మద్యం విరివిగా తీసుకొస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కావడం, పన్నులు లేకపోవడం, సగం ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రానికి వాటిని తీసుకొస్తున్నారు.
టూరిస్టుల ముసుగులో శ్రీలంకకు..
అక్రమంగా మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి విక్రయించే ముఠా ఈ మధ్యన విదేశాలను నుంచి మద్యాన్ని దిగుమతి చేస్తోంది. కొంత మందిని టూరిస్టుల ముసుగులో రూ.4,000 వేల ఫ్లైట్ టికెట్లతో శ్రీలంకకు పంపిస్తున్నారు. అక్కడ దొరికే రాయల్ సెల్యూట్ మద్యం బాటిళ్లను వారి ద్వారా హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. రాయల్ సెల్యూట్ మద్యం ధర శ్రీలంకలో రూ.12 వేలు ఉండగా తెలంగాణలో రూ. 25 వేలు ఉండడంతో ఇలా నాన్ పెయిడ్ లిక్కర్‌ను రాష్ట్రంలోకి తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రైళ్లలో తీసుకొచ్చే మద్యంపై
ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా, గోవా నుంచి వచ్చే నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించాలని మద్యం వ్యాపారులు కోరుతున్నారు. దీనివల్ల తాము కూడా ఆదాయాన్ని కోల్పోతున్నామని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా రైళ్ల ద్వారా అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందని, రైల్వే పోలీసులతో సమన్వయం చేసుకొని అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని మద్యం వ్యాపారులు కోరుతున్నారు.