రాష్ట్ర శా సనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ప్రస్తుతం శాసనపరిషత్తు కార్యదర్శి గా ఉన్న వి.నరసింహా చార్యులు ఆయన కు బాధ్యతలు అప్పగించారు. ఇకపై నరసింహాచార్యులు శాసనమండలి కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం తిరుపతి, నరసింహాచార్యులు శాసనసభ స భాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసా రు. ఈ సందర్భంగా సభాపతి నూతన కార్యదర్శి తిరుపతికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేండ్ల తి రుపతి శాసనసభ కార్యదర్శిగా నియామకం కావడానికి ముందు వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.