ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ 2026లో దాదాపు 21,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ప్రత్యేక టెక్ జాబ్‌ల కోసం సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ప్యాకేజీలు అందించనుంది. ఈ జీతాలను నాలుగు స్లాబ్‌లుగా విభజించారు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 (ట్రైనీ)కు వార్షికంగా రూ.21 లక్షలు, ఎల్2కు రూ.16 లక్షలు, ఎల్1కు రూ.11 లక్షలు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్‌కు రూ.7 లక్షలు ఇస్తారు. ఈ జాబ్‌ల కోసం బిఇ, బిటెక్, ఎంఇ, ఎంటెక్, ఎంసిఎ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎఐపై దృష్టి పెట్టిన కారణంగానే ఈ జీతాల పెంపు జరిగిందని ఇన్ఫోసిస్ సిహెచ్‌ఆర్‌ఒ షాజీ మాథ్యూ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 12,000 మంది ఫ్రెషర్లను నియమించామని సిఎఫ్‌ఒ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య వరుసగా ఐదో త్రైమాసికంలో పెరిగింది.