కాచిగూడలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఎసిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. మంటల్లో కాలి రహీం అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.