రాజీవ్ గాంధీ అఖిల భారత క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలను వచ్చే నెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఏఐసిసి నాయకుడు, మాజీ ఎంపీ, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ వి. హనుమంత రావు వెల్లడించారు.గత 18 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో హైదరాబాద్‌లో అండర్-19, ఛండీగడ్లో అండర్-17, చెన్నైలో అండర్-15 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తున్నామని విహెచ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ టోర్నమెంటులో నాలుగు దేశాలు, పది రాష్ట్రాలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. ఈ టోర్నీలో శ్రీలంక, దుబాయ్, మలేషియా, నేపాల్, తమిళనాడు, మహారాష్ట్ర, చెన్నై, బీహార్, విదర్బ, కర్నాటక, బెంగళూరు, తెలంగాణ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ జట్లు పాల్గొంటాయని ఆయన వివరించారు. 10వ తేదీన ఎల్‌బి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తారని విహెచ్ తెలిపారు.