భార్యను కత్తితో గొంతు కోసిన సంఘటన హనుమకొండ జిల్లా, ఆత్మకూరులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తిరుపతి తెలిపిన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మంద రవి, మానస దంపతులకు మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రవి శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి గొంతు వెనుక భాగం, కడుపులో పొడిశాడు. అలజడి కావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలించగా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో పట్టుబడ్డాడు. అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.