ఇంతవరకు శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య 30 లక్షలు దాటింది. అయితే గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 25 నాటికి రెండు లక్షల మంది తగ్గారని డేటా చెబుతోంది. డిసెంబర్ 25న30,01,532 మంది యాత్రికులు శబరిమలకు రాగా, గత ఏడాది డిసెంబర్ 23 నాటికే 30,78,044 మంది యాత్రికులు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 25నాటికి మొత్తం 32,49,756 మంది దర్శించుకున్నారు. 2023లో ఇదే సమయానికి 28.42 లక్షల మంది శబరిమలకు తరలి వచ్చారు. యాత్ర ప్రారంభంలో భారీగా భక్తులు రావడం కనిపించింది. అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్స్ స్పాట్ బుకింగ్స్ వద్ద రద్దీని నియంత్రించడానికి కఠిన పరిమితులు విధించారు.