గుండెపోటుకు సరైన , సకాల చికిత్స అందకపోవడంతో కెనడాలో ఓ భారతీయ సంతతి వ్యక్తి మృతి చెందాడు. ఓ వైపు తీవ్రస్థాయి గుండె నొప్పితో బాధపడుతూ రాగా ఎనిమిది గంటల పాటు వేచి చూసేలా చేశారు. దీనితో సంవత్సరాల ప్రశాంత్ శ్రీకుమార్ తట్టుకోలేక కన్నుమూశారు. ఆయన తండ్రి కుమార్ శ్రీకుమార్ తన కళ్ల ముందే కొడుకు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడని, తాను ఏమి చేయలేకపోయానని చెప్పారు. వాడు కళ్లముందే నొప్పితో బెడ్‌పై ఎగిసిపడుతూ ఉండటం చివరి క్షణాలు అయ్యాయని చెప్పాడు ఈ నెల 22 న ఎడ్మంటన్ లోని గ్రే నన్స్ హాస్పిటల్‌లో దారుణం జరిగిందని గ్లోబల్ న్యూస్ తెలిపింది. పనిచేసే చోట ఉన్నట్టుండి విపరీతమైన ఛాతీనొప్పి రావడంతో ప్రశాంత్ ఆసుపత్రిలో చేరాడు, చాలా మందితో పాటు ఆయనను చికిత్స కోసం ఎదురుచూసేలా చేసిన అధికారులు తరువాత ఇసిజి జరిపారు.
తరువాత సమస్య ఏది లేదని చెప్పి కూర్చోమని చెప్పారు. నొప్పితో ప్రాణం పొయ్యేలా ఉందని తండ్రికి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. ఎనిమిది గంటల తరువాత చికిత్సకు తీసుకువెళ్లారని , పది సెకండ్లలోనే తనవైపు చూస్తూ ఛాతీపై చేయి పట్టుకుని బెడ్‌పైనే కుప్పకూలాడని తండ్రి తెలిపారు. తన కండ్ల ముందే నిస్సహాయ స్థితిలో కొడుకు చనిపోతూ కన్నించడం తనకు అంతులేని బాధను కల్గించిందని తండ్రి చెప్పారు. మృతుడికి భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి ఎప్పుడూ పర్యాటక ప్రాంతానికి వెళ్లేవాడు. పిల్లలంటే ప్రాణం. ఇప్పుడు వాడు లేకుండా పోయాడని తండ్రి కుమార్ అంతులేని విషాదంతో కెనడాలో గడపాల్సి వచ్చింది. తన కుటుంబానికి పేరు తెచ్చిపెట్టిన కొడుకు లోటు తనను జీవితాంతం వేధిస్తుందని తెలిపారు, అల్లాడుతున్న రోగిని చూడటానికి రాని ఈ ఆసుపత్రి అన్యాయంగా తన కొడుకును పొట్టన పెట్టుకుందని వాపోయాడు,