హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల పాలు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ హయాంలో దండుపాళ్యం ముఠాలా దోచుకున్నారని విమర్శించారు. ప్రజల కోసమే అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపట్టామని తెలియజేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే డబ్బు ఇవ్వడం కాదని, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే కోటీశ్వరులుగా మారుతారని చామల పేర్కొన్నారు. కెటిఆర్.. సిఎం రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సిఎం అయ్యారని, మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కెటిఆర్ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.