హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో అన్నోజిగూడ గ్రామం వద్ద భారీ అగ్ని ప్రమాదం తప్పింది. ఘట్ కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్నపెట్రోల్ బంకులో మారుతీ ఓమ్ని వ్యాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం అదుపు తప్పి పెట్రోల్ బంకు లోకి దూసుకెళ్లింది. అప్రమత్తమై ప్రయాణికులను వ్యాన్ డ్రైవర్ కిందకు దింపేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే బంకు సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోచారం ఐటి కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.