జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్-ఛండీగఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 367పరుగులు చేసింది. ఛండీగఢ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. యుపి బ్యాట్స్‌మెన్లలో రింకూ సింగ్(60 బంతుల్లో 106 పరుగులు) సెంచరీ, అర్యాన్ జుయాల్ (118 బంతుల్లో 134 పరుగులు) సెంచరీలు చేశారు. ధృవ్ జురెల్(67) హాప్ సెంచరీ చేసి పర్యాలేదని పించాడు. ఛండీగఢ్ బౌలర్లలో తరన్ ప్రీత్ సింగ్ రెండు వికెట్లు, సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా తలో ఒక వికెట్ తీశారు.