జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి-ఉత్తరాఖండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ జట్టు 332 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వికెట్ కీపర్ హార్దిక్ టోమర్ 93 పరుగుల చెలరేగి ఆడారు. అన్నదమ్ముడు సర్ఫరాజ్, ముషీర్ కాన్ హాఫ్ సెంచరీలతో పర్వాలేదనిపించారు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. చివరలో శామ్స్ ములానీ 48 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దేవేంద్ర సింగ్ బోరా మూడు వికెట్లు తీయగా జగ్మోహన్ నాగర్ కోటి, మయాంక్ మిశ్రా, జగదీశ్ సుచిత్, యువరాజ్ చౌదరీ తలో ఒక వికెట్ తీశారు.