మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కర్నె జ్యోతి వీరేశంను వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాచారంలో కర్నె జ్యోతి వీరేశం గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పాటు గ్రామంలోని పదికి పది వార్డుల్లో గెలుపొంది 799 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత దేశముఖ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటాల సోమేశ్వర్, జిల్లా అధ్యక్షులు జిలుగు అడిమప్ప, ప్రధాన కార్యదర్శి మల్లప్ప, నేతలు పట్టూరి అంజయ్య, గుండా వీరేశం, సురుగు సురేష్, ఎం.శేఖర్, ఎం.మురళి, డి నాగప్ప, జలంధర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు