జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబయి-ఉత్తరాఖండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి జట్టు 28 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగ్మోహన్ నాగర్ కోటికి క్యాచ్ ఇచ్చి రోహిత్ మైదానం వీడాడు. అంగ్ క్రిష్ రఘువంశ్ 11 పరుగులు చేసి జగ్మోహన్ నాగర్ కోటి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ముషీర్ ఖాన్ 55 పరుగులు చేసి మయాంక్ మిశ్రా బౌలింగ్‌లో సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 55 పరుగులు చేసి సుచిత్ బౌలింగ్‌లో అతడేకే క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సిద్దేశ్ లాడ్(17), హార్దిక్ టోమర్(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.