హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో పిల్లల ముందే భార్యపై దాడి చేసి ఆమెపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో భర్త తోసేసి పారిపోయాడు. అరుపులు, కేకలు విని స్థానికులు వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా స్వల్ప గాయలతో కూతురు బయటపడింది. నల్గొండ జిల్లా హుజురాబాద్ కి చెందిన వెంకటేష్, త్రివేణి గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో త్రివేణి అమ్మ వారి ఇంటికి వెళ్లింది. ఇప్పటినుండి మారుతానని అంటూ మళ్ళీ త్రివేణిని హైదరాబాద్ కు వెంకటేష్ తీసుకొచ్చాడు. హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజులకే భార్యపై పెట్రోల్ పోసి తగటబెట్టాడు. నల్లకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం పరారైనా వెంకటేష్ ను 12 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.