అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ సొంత కారులో మృతదేహం కనిపించింది. నాయక్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి. తన సొంత కారులోనే పడుకొని విగతజీవిగా పడిఉన్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులు తెలిపారు. రెండో మూడో రోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సర్దార్ నాయక్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారంగా గుర్తించారు.