అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలూరు దగ్గర జాతీయ రహదారి 40పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సును క్వాలిస్ ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్వాలిస్ వాహనం డివైడర్ ఢీకొట్టి అనంతరం ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. క్వాలిస్ వాహనంలో మృతదేహాలు ఇరుక్కున్నాయి. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.