న్యూఢిల్లీ : సంతాలి భాషలో వెలువడిన భారత రాజ్యాంగాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దేశం లోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన సంతాలిని 2003 లో 92 వ సవరణ ద్వారా రాజ్యాంగం లోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చడమైంది. ఝార్ఖండ్, ఒడిశా,పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో గిరిజనులు ఈ సంతాలి భాషను మాట్లాడుతుంటారు. భారత రాజ్యాంగం ఇప్పుడు సంతాలి భాషలో ఒలిచికి శైలిలో లభించడం సంతాలి ప్రజలందరికీ గర్వకారణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్బంగా అభివర్ణించారు. రాజ్యాంగం శత వార్షిక సంవత్సరంలో సంతాలి భాషలో రాజ్యాంగం వెలువడడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఆయన సహచర బృందం కృషి చేశారని ప్రశంసించారు.