క్రిస్మస్ నాడు కూడా రష్యా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడడంలో రెండు దేశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ రోజు సాయంత్రం ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రెసిడెంట్ జెలెస్ స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోవాలని శాపనార్థాలు పెట్టారు.క్రిస్మస్ ఈవ్ ముందు మంగళవారం ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలలో రష్యా భారీ ఎత్తున క్షిపణుల దాడి చేసింది. ఆ దాడులలో ముగ్గురు చనిపోయారు. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ కేంద్రం దెబ్బతింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ తన ప్రసంగంలో పుతిన్ చనిపోవాలన్న కోరిక వెల్లడించారు. ఉక్రెనియన్ ప్రాచీన గ్రంథాల ప్రకారం క్రిస్టమస్ నాటి రాత్రి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారని, ఆ సమయంలో ఎవరు ఏమి కోరుకున్నా,తాము కలలు చెబుతే, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనమంతా ఈ రోజు ఒకే కోరిక కోరుకుందాం-. అతడు చనిపోవాలని అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. క్రిస్మస్ రోజున కూడా దాడులు ఆగలేదు. రష్యా ఉక్రెయిన్ పై 131 డ్రోన్ లను ప్రయోగించింది. ఉక్రెయిన్ దళాలు చాలా డ్రోన్ లను కూల్చివేసినా, వాటిలో 22 డ్రోన్ లు దాదాపు 15 ప్రదేశాలలో తీవ్ర నష్టం చేశాయని ఏబిసి వార్తా సంస్థ పేర్కొంది.
.