భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారిని పరశురామావ తారంలో అలంకరించారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవలు నిర్వహించి ఆరాధన ఇచ్చారు. పరశురామావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువు దీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల కోలాటాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించు కుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరు వీధి సేవ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామివారు శుక్రవారం తన నిజరూపమైన రామావతారంలో దర్శనమివ్వను న్నారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్న ధర్మాచరణయే ఉత్త మమైనదని అదే శాశ్వతమైనదని భావించి, పరిపూ క్షమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్త ముడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామ చంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామాన తారాన్ని దర్శించటంవల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.