తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి పోటీకి బిజెపి సిద్ధం అయింది. తిరువనంతపురం బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు వివిరాజేష్‌ను బిజెపి గురువారం ప్రకటించింది. 45 పంవత్సరాల వామపక్ష పాలనకు అంతం పలుకుతూ ఇటీవలి ఎన్నికలలో బిజెపి అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్ల స్థానాలు గెలిచింది. మేయర్ పదవికి రాజేష్, డిప్యూటీ మేయర్ పదవికి మహిళా కౌన్సిలరు ఆశానాథ్ పేర్లను బిజెపి కేరళ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ గురువారం వెల్లడించారు.
పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా స్థాయిలో అభిప్రాయాల సేకరణ తరువాత ఎంపిక జరిగింది. ఇక బిజెపి తరఫున గెలిచిన రిటైర్డ్ డిజిపి ఆర్ శ్రీలేఖ మేయర్ అవుతారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ పార్టీలో పాతుకు పోయి ఉన్న వారు కొందరు ఆమెను వ్యతిరేకించారు. దీనితో సీనియర్ నేత రాజేష్‌ను ఎంపిక చేశారని వెల్లడైంది.