కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లి, కొడుకును దారుణంగా హత్య గురైన సంఘటన తెల్లాపూర్ పరిధిలోని జ్యోతిరావు పూలే కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన చంద్రకళ (30) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె కుమారుడు రేవంత్ (14) నార్సింగ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. కాగా చంద్రకళ భర్త జై సింగ్‌తో సుమారు ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. నార్సింగ్‌లో ఉన్నప్పుడు నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ వడ్డే శివరాజ్ తో పరిచయం ఏర్పడింది. ఈ విషయంలో వడ్డే శివరాజుకు ఆమె భార్య శ్రీదేవి లకు తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రీదేవి శివరాజును వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా గత కొత్తకాలంగా శివరాజు, చంద్రకళలు కలిసి నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా గత సుమారు మూడు రోజుల క్రితం నార్సింగ్ లో ఉన్న వీరు తెల్లాపూర్ పరిధిలోని జ్యోతిరావు పూలే కాలనీలో ఓ ఇంటిని అద్దెక్కి తీసుకొని ఉంటున్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి ఇంట్లో చంద్రకళ, వడ్డే శివరాజుకు గోడవ జరిగినట్టు తెలుస్తుంది. కాగా గురువారం మధ్యాహ్నం రేవంత్ స్నేహితుడు అతని ఇంటికి వెళ్లి పిలవగా బయటకు రాలేదు. లోపలికి వెళ్లి చూడగా వారు రక్తం మడుగులో పడి ఉండడం చూసి వెంటనే స్థానికులు 100కు డయల్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మెడకు తీవ్ర గాయాలు పాలై అక్కడే పడి ఉన్న వడ్డే శివరాజును వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే చంద్రకళ, రేవంత్‌లో కత్తి గాయాలతో మృతి చెంది ఉన్నారు. వడ్డే శివరాజా తల్లి, కొడుకులను హత్య చేసి కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకొని ఉండవచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.