హైదరాబాద్: గంజాయి స్మగ్లర్లపై ఈగల్ టీమ్ దాడులు చేసింది. గురువారం మేడిపల్లిలో పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ గంజాయి పెడ్లర్లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు గంజాయి పెడ్లర్లు పృథ్వీరాజ్, రాహుల్, అక్రం, షఫీలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పృథ్వీరాజ్ హైదరాబాద్ చెంగిచెర్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి పృథ్వీరాజ్ గంజాయి వ్యాపారంలోకి దిగాడు. మరో ముగ్గురు నిందితులతో కలిసి పృథ్వీరాజ్.. ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.