లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్ణాటకలో జరిగింది. గురువారం బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలో వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కు ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.