రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. హారర్, కామెడిగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలానే అప్‌డేట్స్ వచ్చాయి. అవన్నీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచ మరో అప్‌డేట్ వచ్చింది. క్రిస్మస్ కానుకగా.. ‘రాజే.. యువరాజే’ అంటూ సాగే మెలోడి పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలలాగానే ఈ పాట కూడా వెంటనే ఆకట్టుకుంటుంది. అయితే పూర్తి పాటని ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా 2026, జనవరి 9న విడుదల కానుంది.