భువనేశ్వర్: బాలికను గ్రామ శివారులో తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చాంద్ బలి ప్రాంతంలో ఓ గ్రామంలో మంగళవారం బాలిక స్కూల్‌కు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. ఎక్కడా పాప కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని ఓ తోటలో బాలిక మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రక్ ఎస్‌పి మనోజ్ కుమార్ రౌత్, ఎఎస్‌పి అరూప్ అభిషేక్ బెహరాలు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రధాని నిందితుడిని జగత్సింగ్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. దీంతో గ్రామస్థులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.