అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జనాలపైకి మినీ ట్రక్కు దూసుకెళ్లింది. ట్రక్కు ఢీ కొనడంతో బాలుడు మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనాలు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. వినుకొండ చెక్ పోస్టు సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.