ముంబయి: మహారాష్ట్రలోని దేవాడ ప్రాంతం సోండో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగ్‌పుర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక బాలిక అక్కడికక్కడే చనిపోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బ్రిడ్జిలపై అతి వేగము మంచిది కాదని పోలీసులు సూచిస్తున్నారు.