మాస్కో: చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలుదేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాము చేపడుతోన్న లూనార్‌ప్రోగ్రామ్‌తోపాటు రష్యాచైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్షంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించింది.
చంద్రుడిపై 2026 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్టు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్‌మస్ వెల్లడించింది. ఇందుకోసం ఎరోస్పేస్ కంపెనీ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ , రష్యా చైనా సంయుక్త పరిశోధన కేంద్రంతోపాటు తమ సొంత లూనార్ ప్రోగ్రామ్‌కు విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని పేర్కొంది.