తమిళనాడులో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. తిరుచిరాపల్లి జిల్లాలోని కడలూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. ఆ రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు” అని జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.