న్యూఢిల్లీ: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అల్ హింద్ ఎయిర్,ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం నో అబ్జెక్షన్ (ఎన్‌ఒసి) సర్టిఫెకెట్లు మంజూరు చేసింది. దీంతో ఈ రెండు విమానయాన సంస్థలతోపాటు ఇప్పటికే ఎన్‌ఒసి పొందిన శంఖ్ ఎయిర్ కూడా కొత్త ఏడాది నుంచి సేవలు ప్రారంభించనున్నాయి.
కేంద్ర పౌర విమానయాన మంత్రి కే. రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా శంఖ్ ఎయిర్ కార్యకలాపాలు నిర్వహించనున్నది. అల్ హింద్ ఎయిర్‌ను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది.