విశ్వక్‌సేన్, కయాదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ’. కెవి అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ నవ్వులు పూయించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ధీరే ధీరే’ అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాటని సంజిత్ హెడ్గే, రోహిణి పాడారు. దర్శకుడు కెవి అనుదీప్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నరేష్, విటివి గణేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల కానుంది.