రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాల్‌కు ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అతడిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడిని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు జైపూర్ పోక్సో కోర్టు నిరాకరించింది.
క్రికెట్‌లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కొన్ని నెలల క్రితం రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. జైపూర్‌లో ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా తొలిసారి యశ్‌ను కలిసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. క్రికెట్ కెరీర్‌లో సలహాలు ఇస్తానంటూ ఓ హోటల్‌కు పిలిచి.. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు ఆ అమ్మాయి వయస్సు 17 సంవత్సరాలు కావడంతో పోక్సో చట్టం కింద యశ్ దయాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం 10 ఏళ్లు లేకపోతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.