హైదరాబాద్: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్‌ఒటి పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డిసిపి రితు రాజ్ ఈ వివరాలను వెల్లడించారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారని తెలిపారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నాట్లు గుర్తించామన్నారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. ఒక్కో చిన్నారిని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తు తేలినట్లు తెలిపారు.