ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఎవరంటే అందరకి గుర్తొచ్చేది హీరోయిన రష్మిక గురించే. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఇక రష్మిక నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మైసా’. ఈ చిత్రం ద్వారా రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులతో రష్మిక పాత్రను పరిచయం చేశారు. ‘‘నా బిడ్డ ఉపిరి మోయలేక అగ్గి బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’’ అనే డైలాగ్ అదిరిపోయింది. ప్రతీకారం తీర్చుకొనే ‘మైసా’ పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.