అమరావతి: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. వివాహమై ఏడాది పూర్తయినందున శ్రీవారిని దర్శనానికి వచ్చానని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ రంగంలో బాగా రాణించాలని వేడుకున్నానని, వచ్చే ఏడాది ఇండోనేషియా, మలేషియా, ఇండియాలో టోర్నమెంట్లు ఉన్నాయని తెలియజేశారు. విశాఖలో అకాడమీ నిర్మాణం జరుగుతోందని.. మంచి పేరు రావాలని ప్రార్థించానని పివి సింధు పేర్కొన్నారు.