హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుతపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రి సమయంలో బండపై కూర్చున్న చిరుతను అటుగా వెళ్తున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. రుద్రంగి, మర్రిమడ్ల, మనాల ప్రాంతాల్లో చిరుతల కదలికలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.