కొలంబో : దిత్వాతుపాన్ బాధిత శ్రీలంకకు పునరావాస సాయం కింద 450 మిలియన్‌డాలర్ల ప్యాకేజీని భారత్ ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి భారత్ అంకితభావంతో సాయం అందిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ శ్రీలంక అధినేతలకు భరోసా ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రత్యేక దౌత్య రాయబారిగా జైశంకర్ ఇక్కడకు వచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దాసనాయకేను జైశంకర్ కలుసుకుని ప్రధాని మోడీ తరఫున అభినందనలు తెలియజేశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్‌తో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. తుపాన్ నష్టాల గురించి అధ్యక్షుడు అనుర కుమార దాసనాయకేతో చర్చించామని , భారత్ నుంచి సాయం వేగంగా అందాలన్నదానిపై చర్చించామని జైశంకర్ తెలిపారు.