తన వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలు దొర్లాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రస్‌లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా శివాజీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు.