నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈక్రమంలో ఆయన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించింది. మరోవైపు, తన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణల చెబుతూ వీడియో విడుదల చేశారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలను ఉపయోగించానని.. తనను క్షమించండని శివాజీ క్షమాపణలు తెలిపాడు.
కాగా, హీరోయిన్ల డ్రెస్సులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు ఫైరవుతున్నారు. ఇప్పటికే ఆయనపై ‘మా’కు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాత స్వప్నదత్, నటి మంచు లక్ష్మీ, ఝాన్సీ, సుప్రీయ యార్లగడ్డ.. శివాజీపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇక, హాట్ యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారని విమర్శించారు. “ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్లేసుకుంటారు.. నచ్చినట్టు తింటారు” అంటూ ఫైరయ్యారు అనసూయ. సింగర్ చిన్మయ్ కూడా శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతూ సోషల్ మీడియాలో ద్వజమెత్తారు.
ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ.. మహిళల డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ.. హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారని.. అందంగా కనిపించడానికి.. సామాన్లు కనిపించేలా సగం సగం దుస్తులు వేసుకోవద్దని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేషనల్ మీడియాలోనూ శివాజీ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.