భారతదేశం – న్యూజిలాండ్ మధ్య కొత్తగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆదేశపు విదేశాంగమంత్రి విన్ స్టన్ పీటర్స్ తీవ్రంగా విమర్శించారు. ఆ ఒప్పందం న్యాయంగాలేదు, స్వేచ్ఛ గా లేదు అన్నారాయన. పార్లమెంటులో చర్చ సందర్భంగా తమపార్టీ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.తమ పార్టీ న్యూజిలాండ్ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుందని అంటూ, ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాల్సివచ్చినందుకు విచారిస్తున్నామని పీటర్స్ తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ల విషయంలో ఈ ఒప్పందం చాలా ఉదారంగా ఉందని, అంతే కాక, కీలకమైన పాడి పరిశ్రమ రంగంలో ఒప్పందం న్యూజిలాండ్ కు లాభదాయకంగా లేదని విన్ స్టన్ పీటర్స్ వాదించారు. ఏమైనా ఇది న్యూజిలాండ్ కు సంబంధించినంతవరకూ చెడ్డ ఒప్పందం అన్నారు. న్యూజిలాండ్ ప్రధాన పాల ఎగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారతదేశం అంగీకరించలేదన్నారు. ఇది న్యూజిలాండ్ రైతులకు నష్టదాయకం అని ఆయన అభిప్రాయపడ్డారు.