సాధారణంగా హ్యాట్రిక్ సాధిస్తే.. దాన్ని ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటారు బౌలర్లు.. అతడి టీమ్. మరి ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీస్తే.. అంతేకాక.. అదే ఓవర్‌తో మొత్తం మ్యాచ్‌నే గెలిపిస్తే.. ఆ ఆనందాన్ని అవుధులు ఉండవు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఇండోనేషియా-కంబోడియా మధ్య జరిగిన టి-20 మ్యాచ్‌లో జరిగింది. ఇండోయానేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టించాడు. టి-20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అంతేకాక.. తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం.
బాలి వేదికగా మంగళవారం కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కంబోడియా 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టంగానే కనిపించింది. కానీ, అప్పుడే గ్రెడే ప్రియాందన ఎంటరయ్యాడు. 16వ ఓవర్‌లో తొలి మూడు బంతులకే ముగ్గురిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత బంతి డాట్ బాల్ అయింది. ఆ తర్వాతి రెండు బంతుల మధ్యలో ఒక వైడ్ వేసి రెండు వికెట్లు తీశాడు. దీంతో కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ అయింది. పలితంగా ఇండోనేషియా ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ప్రియాందన 11 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితేనేం బంతితో కంబోడియా బ్యాటర్లను వణికించాడు. 1 ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అంతర్జాతీయ టి-20ల్లో తొలి బౌలర్‌గా నయా చరిత్ర లిఖించాడు. గతంలో ఇలాంటి ఫీట్ కేవలం దేశవాళీ క్రికెట్‌లో కేవలం రెండు సానకలు మాత్రమే నమోదైంది. 2013-14లో విక్టరీడే టి-20 కప్‌లో యుసిబి-బిసిబి మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ అల్ మీన్ హోస్సేన్ ఒకే ఓవర్‌లో ఐధు వికెట్లు తీశాడు. ఇక 2019-20లో సయ్యద్ మస్తాద్ అలీ ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు అభిమన్యు మిథున్ హరియాణాపై ఈ ఘనతను సాధించాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ప్రియాందనదే తొలి రికార్డు.IDROVISIA