హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనమంట్ర మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. పోలమూరులో మద్యం మత్తులో ముగ్గురు యువకుడు గోడను ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు31 మంది ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణ నష్టం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.