వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్యకు కుట్ర
భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
మన తెలంగాణ/బోడుప్పల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలు తన ప్రియుడు, స్నేహితులు కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… బోడుప్పల్ లోLR తూర్పు బృందావన్ కాలనీలో వి జె అశోక్ (45) తన భార్య పూర్ణిమ(36), కొడుకుతో నివాసం ఉంటున్నారు. అశోక్ శ్రీనిధి విశ్వవిద్యాలయంలో లాజిస్టిక్ మేనేజర్ గా, భార్య పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.తన భార్య పూర్ణిమ,గతంలో అదే కాలనీలో నివాసం ఉన్న ప్రియుడు భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త తన భార్యను ప్రశ్నించడం వేధించడం ప్రారంభించాడు. దీని కారణంగా తన భార్య ప్రియుడుతో కలిసి భర్తను అంతమొందించడానికి కుట్రపన్నారు. ప్రియుడి స్నేహితుడైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూక్య సాయికుమార్ (22) సహాయంతో ఈనెల 11న తన భర్త పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ ,సాయి కుమార్ అతని పట్టుకుని దాడి చేయగా భార్య అతని కాళ్లు పట్టుకుంది. మహేష్ మూడు చున్నీలతో మృతుడిని గొంతు కోసి హత్య చేశారు. హత్య తర్వాత నిందితుడు మృతుడి బట్టలు మార్చాడు. సాక్షాలు లేకుండా చేయడానికి వస్తువులను పడేశాడు. తన భర్త గుండెపోటు వల్ల మరణించాడని బంధువులను తప్పుదారి పట్టించింది. తన భర్త ఇంటి వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని మల్కాజ్గిరి ప్రభుత్వాసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మొదట్లో ఎలాంటి అనుమానం కలుగలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహంపై అనుమానాస్పద గాయాలు కనిపించడం, చెంప, మెడపై గాయాలు కూడా ఉండడంతో మరణంపై కొంత అనుమానం రావడంతో సిసిటివి ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు ఆపిల్ ఫోన్ (ఏ2), రక్తంతో తడిసిన మూడు చున్నీలు, మరకలున్న చొక్కా బనియన్, మరణించిన వ్యక్తి విరిగిన పళ్ళు, నేరారూపణ చేసే ఫోటోలు, వీడియోలు ఉన్న ఒక పెన్ డ్రైవ్, ఫ్యాషన్ ప్రో 2 వీలర్ బైక్ (ఏ 3), రక్తపు మరకలు ఉన్న ప్యాంటు చొక్కా (ఏ3) ఆధారాలతో ఏ1 తన భార్య పూర్ణిమ, ఎ2 పాలేటి మహేష్ , ఎ3 భూక్య సాయికుమార్‌గా నిందితులుగా గుర్తించారు. కేసును సెక్షన్ 194 బిఎన్‌ఎస్‌ఎస్ నుండి సెక్షన్ 103(1),238 ఆర్/డబ్ల్యూ 3(5) బిఎన్‌ఎస్ కు మార్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఐపిఎస్ నాయకత్వంలో మల్కాజిగిరి జోన్ డిసిపి సిహెచ్ శ్రీధర్, మల్కాజ్గిరి డివిజన్ ఎసిపి ఎస్ చక్రపాణి, ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును గుర్తించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి , ఎస్ఐ నర్సింగరావు, ఉదయ భాస్కర్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.