హఠాత్తుగా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ చేసిన అమెరికా
వాషింగ్టన్ పోస్ట్ కథనం హెచ్1బి వీసాదారులకు తప్పని తిప్పలు
స్వదేశానికి వచ్చి చిక్కుపడిపోయిన వేలాదిమంది టెకీలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: హెచ్1 బి వీసాదార్లకు అమెరికాలో తరచూ మారుతున్న వీసా నిబంధనలు చుక్కలు చూపుతున్నాయి. తమ వర్క్ పర్మి ట్ల రెన్యూవల్‌కు తరలివచ్చిన హెచ్1 బి వీసాదార్లు, ప్రత్యేకించి యువత ఇప్పుడు భారత్‌లో నే చిక్కుపడ్డారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను నిలిపివేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా కౌన్సిలర్ కార్యాలయాల్లో వారి అపాయింట్‌మెంట్లను హఠాత్తుగా రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నది. డిసెంబర్ 1526 మధ్య జరగాల్సిన అపాయింట్‌మెంట్ల ను వాయిదా వేసింది. హాలీడే సీజన్‌ను కారణమని అంటున్నారు. అయితే, అమెరికా ఇటీవల వీసా జారీకి భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టిం ది. ప్రత్యేకించి వీసా దరఖాస్తుదార్ల గత సోషల్ మీడియా, ఇప్పటి సమాచారం క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలనే నిబంధనకు దిగింది. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ భారతీయ ఐటి నిపుణులకు, వర్కర్లకు ఇ మొయిల్ ద్వారా స మాచారం పంపిస్తూ ఇంటర్వూలను వచ్చే ఏ డాది వరకూ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియా పరిశీలన పాలసీ (వెట్టింగ్) క్రమంలో ఇంటర్వూలను నిలిపివేస్తున్నట్లు తె లిపారు. దీనితో డిసెంబర్ చివరిలో జరగాల్సిన ఇంటర్వూలు, కొత్తగా హెచ్1 బి వీసాల జారీ లు, రెన్యూవల్స్ నిలిచిపోయ్యాయి. జనవరిలో జరుగుతాయని చెపుతున్నారు కానీ అమెరికా వీసా ఇమిగ్రేషన్ వర్గాల నుంచి సంబంధిత విషయంపై పూర్తి స్థాయి అధికారిక నిర్థారణ రాలేదు. దీనితో భారతీయ ఐటి వర్గాలలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థుల ఇప్పుడు దేశంలో నిలిచిపోవల్సి వచ్చిందని పలు ప్రముఖ లా కంపెనీలు తెలిపాయి. వర్క్ ప ర్మిట్ల పునరుద్ధరణకు వందలాది మంది ఈ నెల తొలి దశలో ఇండియాకు వచ్చారు. అయితే ఇప్పుడు వారి వీసా అపాయ్‌ట్మెంట్లు అర్థాతరంగా రద్దు కావడం, తరువాత ఇంటర్వూ లు జరుగుతాయని చెప్పడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరం అయిందని వీసా సంబంధిత కంపెనీ వర్గాలు తెలిపాయి.
జాబ్‌లపై భయాలతో ఐటి యువత
అమెరికాలో క్రిస్మస్, ఆ తరువాతి నూతన సంవత్సర సెలవు ల సీజన్ దశలో వీసాదార్ల అపాయ్‌ట్మెంట్లు ఎక్కువగా ఈ నెల 15 నుంచి 26 మధ్యలో ఖరారు అయ్యాయి. అయితే వీసా ఇంటర్వూల కొత్త నిబంధనలతో ఈ ఇంటర్వూలను ఇప్పుడు రద్దు చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలలో జరుగుతాయని సమాచా రం అందించారు. ఇదంతా కూడా మహా గందరగోళానికి దారితీసింది. ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఇకపై ఇంటర్వూలు ఏప్పుడు జరుగుతాయనేది ఇప్పుడైతే చెప్పలేమని ప్రముఖ వీసా కన్సల్టెంట్ సంస్థల వారు తెలిపారు. ఈ విషయంపై ఏదైనా పరిష్కార మార్గం ఉందా అనేది తాను చెప్పలేకపోతున్నట్లు ఇమిగ్రేషన్ సంబంధిత న్యాయ నిపుణులు వీణా విజ య్ అనంత్ వాషింగ్టన్ పోస్టుకు తెలిపారు. డెట్రాయెట్ శివార్లలో హెచ్ 1 బి వీసాపై ఉన్న ఓ వ్యక్తి ఈ నెలలోనే బంధువుల పెళ్లి ఉందని ఇండియాకు వచ్చాడు. పైగా ఆయనకు ఈ నెలాఖరులో నే కాన్సులర్ అపాయ్‌ట్మెం టు ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రి య లేకుండా పో యింది. తమ యాజమాన్యాలు తమను ఎంతకాలం ఉద్యోగాలలో ఉంచుతాయనే భయాలు పలువురిలో నెలకొన్నాయి.
ఉద్యోగులకు గూగుల్, యాపిల్ షాక్‌లు
ప్రస్తుత దశలో హెచ్ 1బిపై పనిచేసే ఐటిలు అమెరికా వీడరాదని భారత్‌కు చెందిన వారికి హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా టె క్ దిగ్గజ సంస్థలు గూగుల్, యాపిల్ ముందుగానే విషయాలను విశ్లేషించాయి. అమెరికా వీ రీ ఎంట్రీ పద్థతిలో అమెరికా ఎం బస్సీల్లో, కాన్సులేట్స్‌లో జాప్యం జరుగుతుందని కనుగొన్నారు. చివరికి ఇంటర్వూలకు, వీసాల రెన్యూవల్‌కు కనీసం 12 నెలల సమయం పడుతుందని , అందుకే సాధ్యమైనంత వరకూ భారత్‌కు వెళ్లవద్దని ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు అంతర్గత సమాచారం ద్వారా తెలిపారు. అయితే ఇండియాకు రెన్యువల్‌కు వచ్చిన వారు ఇప్పుడు తమ కంపెనీల నుంచి తరువాతి నిర్ణయం గురించి భయపడుతున్నారు. మరో వైపు వీసాల రెన్యువల్‌కు ఎన్ని చిక్కులో, ఎటువంటి మార్పులో అనే ఆందోళన చెందారు.