మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, ఎం. దాన కిశోర్‌కు అపెక్స్ స్కేల్ (లెవ ల్ -17)కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి లేదా వారు బాధ్యతలు స్వీకరించిన తే దీ నుంచి అమల్లోకి రానున్నాయి. పదోన్నతులు, అధికారుల పోస్టింగ్‌లను కూ డా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్‌ను అదే శాఖలో ప్ర త్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎల్‌ఈటీ అండ్ ఎఫ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిశోర్‌ను కూడా అదే శాఖలో ప్రత్యేక ప్రధా న కార్యదర్శిగా కొనసాగించనున్నారు. ఈ మేర కు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.