మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి : ‘నా గుండె పగిలింది, మళ్లీ బిఆర్‌ఎస్ లో చేరిక ఉండదు’ అని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎం ఎల్‌సి కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రెండవ రోజు సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా హరిత హోటల్ లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పుడుచూసినా పిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎ డ్యుకేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ తమ పాలసీ అంటూ గొప్పలు చె ప్పడం శుద్ధ అబద్ధమని అన్నా రు. తెలంగాణలో కేవలం డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీ మధ్య మేజర్ ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. తాను పార్టీలో ఉన్నప్పుడే తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుండి ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడంతో గుం డె పగిలిందని అన్నారు. దీంతో మళ్లీ ఆ పార్టీలో చేరే ఛాన్స్ ఏమా త్రం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
తెలంగాణలో 80.99 శాతం ఎడ్యుకేషన్ ఉందని, అం దులో అర్బన్ తెలంగాణలో 76.9 శాతం రూరల్ తెలంగాణలో 69. 9 శాతం ఉందని అన్నారు. అందులో ఏడాది మహిళల విద్యా శాతం 65.9 నుండి 61.1 శాతానికి పడిపోయిందని అన్నారు. ఏమి సాధించారని రైజింగ్ సంబరాలు చేసుకుంటున్నారని నిలదీశారు. ఆలంపూర్ నియోజకవర్గంలో సిఎం ఫొటోలు పెట్టుకుని అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని, దీనిపై సిఎం స్పందించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఎన్నికల బరిలో తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.