ఆక్సిజన్ పెట్టమన్నందుకు పేషంట్‌పై దాడి
సిమ్లా ఆసుపత్రిలో దారుణం
సిమ్లా : హిమాచల్ ప్ర దేశ్‌లోని సిమ్లా ఆసుపత్రిలో ఓ డాక్టరు రౌడీ గా మారాడు. బెడ్‌పై ఉన్న రోగికి చికిత్స చే యాల్సింది పోయి, వి రుచుకుపడి , పిడిగుద్దులతో చితకబాదా డు. తననే ఏదో అడుగుతావా? అని ఆగ్రహంతో వ్యవహరించా డు. సిమ్లాలోని ఇంది రా గాంధీ మెడికల్ కా లేజీ (ఐజిఎంసి)లో సోమవారం తోటి డాక్టర్లు, వార్డులోని ఇతర రోగులు చూ స్తూ ఉండగానే ఈ డాక్టర్ పైశాచికంగా వ్యవహరించాడు. సోమవారం ఈ ఘటన జరిగింది. శ్వాస సమస్యలతో అర్జున్ పన్వర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.
బెడ్‌పై పడుకున్నాడు. దమ్ము తీస్తూ ఉండగానే డాక్టర్ వచ్చి కొద్ది సేపు ఏదో మాట్లాడి తరువాత తిట్లకు దిగుతూ అంతటితో ఊరుకోకుండా అదేపనిగా ఈ రోగిని విపరీతంగా కొట్టాడు. తనను తాను రక్షించుకునేందుకు రోగి శక్తిలేని స్దితిలో కూడా యత్నిస్తూ ఉన్నా చాలా సేపటి వరకూ ఊగిపోతూ అరాచకంగా మారాడు. తనకు ఇటీవలే శ్వాసకోశ ఆపరేషన్ జరిగింది. బెడ్‌పై తనకు ఆక్సిజన్ లేదని డాక్టర్‌కు చెప్పానని, వెంటనే డాక్టర్ నువ్వు ఎవరివి.? నీ కేసుషీట్ ఏది అంటూ తిట్టినంత పనిచేశాడు , మంచిగా మర్యాదగా మాట్లాడండి అని చెపుతూ ఉన్నా వినకుండా, నీకెందుకు మర్యాద అం టూ తిడుతూ తనను చావబాదాడని రోగి ఆ తరువాత అక్కడికి వచ్చిన విలేకరులకు తెలిపారు.
బజారులో గూండాలాగా ఈ డాక్టరు రోగిపై దాడికి దిగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చాయి. దీనితో ఆసుపత్రి అధికార యంత్రాంగం స్పందించింది. వెంటనే త్రిసభ్య దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి, ఘటనపై ఆరా తీస్తున్నారు. దాడికి దిగిన డాక్టరుపై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది.