మాస్కో: మాస్కోలో సోమవారం కారు బాంబు పేలి కీలక సైనిక ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారు. రష్యా సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ విభాగం అధిపతిగా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ కారు కింద అమర్చిన పరికరం పేలడంతో ఈ సంఘటన జరిగిందని ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. అపార్టుమెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దీని వెనుక ఉక్రెయిన్ ఇంటిలిజెన్స్ హస్తం ఉందన్న అనుమానంతో రష్యా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 2022 నుంచి రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది.
ఈ యుద్ధం ఆపేందుకు ఓవైపు చర్చలు జరుగుతుండగా,మరో వైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇటీవల కాస్పియన్ సముద్రం లోని రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని వెల్లడించింది. ఈ తరుణంలో తాజా సంఘటన చోటు చేసుకుంది.